Take a fresh look at your lifestyle.

అగ్ని ప్రమాదాల్ని నివారించడంలో వారిది ప్రముఖ పాత్ర

 

కోరుట్ల, ముద్ర;
అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా మంగళవారం రోజు కోరుట్ల వాసవి సీనియర్ సిటిజన్ క్లబ్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బందిని శాలువాతో సన్మానించి వారికి జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనుషుల ప్రాణాల్ని కాపాడడంలో ప్రాధాన్యత ఇస్తూ ప్రమాదాల్ని నివారించడంలో ప్రముఖ పాత్ర వహిస్తారని అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించే పరికరాలు ఏ సమయంలో ఎలా వాడటం అనే విషయాన్ని అగ్నిమాపక సిబ్బంది సవివరంగా వివరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జోనల్ చైర్మన్ నీలి శ్రీనివాస్, వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ అధ్యక్షులు కొత్త గణేష్, కోశాధికారి శక్కరి వెంకటేశ్వర్, ఉపాధ్యక్షులు శక్కరి అశోక్, వనిత క్లబ్ అధ్యక్షులు ఎలుగూరి భాగ్య, మౌనిక, గౌతమి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.