ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : వార్త సేకరణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కరీంనగర్ టీవీ9 సీనియర్ కరస్పాండెంట్ సంపత్ కుమార్ ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతీ ఏటా ఉత్తమ జర్నలిస్ట్ లకు ఉగాది పురస్కారాలు అందజేస్తారు.అందులో భాగంగా నిరంతరం వార్తాస్రవంతితో ప్రజలకు, ప్రభుత్వానికీ మధ్య వారధిగా ఉంటూ కచ్చితత్వంతో కూడిన వార్తలు అందించడంలో సంపత్ కుమార్ నిష్ణాతులు.గత 18 ఏళ్లుగా జర్నలిజంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.2024-25 సంవత్సరానికిగాను ఉత్తమ జర్నలిస్టు ఉగాది పురస్కారాన్ని విజయవాడ వేదికగా సంపత్ కుమార్ పేరును ప్రకటించారు. అవార్డు రావడం పట్ల టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ, కార్యదర్శి రామ్ నారాయణ, టియుడబ్ల్యూజే ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎలగందుల రవీందర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, కొయ్యడ చంద్రశేఖర్, రాష్ట్ర అనుబంధ కమిటీ సభ్యులు బల్మూరి విజయసింహారావు, ఒంటెల కృష్ణ, ఈద. మధుకర్ రెడ్డి, నర్సింగోజు మహేంద్ర చారి, మార్త ప్రకాష్, ఉమ్మడి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి ఊరడి రవీందర్, తోపాటు విద్యావంతులు మేధావులు వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.