Take a fresh look at your lifestyle.

కళాశాలకు కవితా నీరాజనం సంపుటి ఆవిష్కరణ….

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి:
కళాశాలలో చాలాకాలం బోధనా నైపుణ్యంతో సేవలందించిన అధ్యాపకుల సేవలను గుర్తించి వారిలోని మంచిని కవిత్వంగా రాసిన కళాశాల తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ బోడ జగన్నాథ్ అభినందనీయులని స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం కళాశాలలో జరిగిన “కళాశాలకు కవితా నీరాజనం సంపుటి” ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించి సంపుటిని ఆవిష్కరిస్తూ ఆయన మాట్లాడారు. కవి వ్యక్తులలోని మంచిని గుర్తించి ఆ మంచినే కవిత్వంగా మలచి సమాజానికి అందిస్తాడని ఆయన తెలిపారు. ఈ సంపుటి విద్యార్థిలోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ప్రిన్సిపల్ తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంజి రమేష్ మాట్లాడుతూ ఈ సంపుటి కళాశాల ప్రగతికి నిదర్శనమని అన్నారు. సంపుటి రచయిత తెలుగు అధ్యాపకుడు డాక్టర్ బోడ జగన్నాథ్ మాట్లాడుతూ కళాశాలలో చాలా కాలం బోధనా సేవలు అందించి ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన అధ్యాపకుల పట్ల కలిగిన అభిమానమే ఈ సంపుటిలోని రచనలకు ప్రేరణ అని అన్నారు. అధ్యాపకులు బాల్ రెడ్డి, కిష్టయ్య సిద్ధిరాములు, బాలరాజు, రామకృష్ణ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సత్యనారాయణ భాస్కర్ లింగమూర్తి బాలయ్య శ్రీకాంత్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.