జోగులాంబ గద్వాల జిల్లా యాసంగి క్రాప్ బుకింగ్‌లో 94.76% నమోదు సాధించి రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచింది:జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల:
యాసంగి క్రాప్ బుకింగ్ ఈనెల 30న ముగియనున్న జిల్లాలో నమోదు ప్రక్రియ వేగవంతం చేసి వంద శాంతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
యాసంగి సీజన్‌లో జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 1,73,707 ఎకరాల్లో పంటలు సాగు చేసినట్లు గుర్తించామని తెలిపారు.అందులో భాగంగా ఇప్పటివరకు 1,64,603 ఎకరాలకు క్రాప్ బుకింగ్ పూర్తి కాగా, 94.76 శాతం నమోదు సాధించి రాష్ట్రస్థాయిలో జిల్లా మూడవ స్థానంలో నిలవడం సంతోషకరమని పేర్కొన్నారు.ఈ ఫలితానికి మండల స్థాయిలో పనిచేస్తున్న వ్యవసాయ అధికారులు మరియు వ్యవసాయ విస్తరణ అధికారుల సమిష్టి కృషి కారణమని కలెక్టర్ అభినందించారు.ఇంకా జిల్లాలో 9,104 ఎకరాల నమోదు మిగిలి ఉండగా,రెండు రోజుల్లో క్రాప్ బుకింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. డిజిటల్ క్రాప్ సర్వేను మార్చి 30లోగా పూర్తిచేయాలని సూచిస్తూ, ఈ ప్రక్రియలో వ్యవసాయ విస్తరణ అధికారులు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి పూర్తి పారదర్శకతతో రైతుల పంటల నమోదు చేపట్టి రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.