Take a fresh look at your lifestyle.

గాయపడ్డ వ్యక్తికి చేయూత

 

కోరుట్ల, ముద్ర;
వారం రోజుల క్రితం జరిగిన వీరహనుమాన్ విజయ యాత్రలో గుర్రాల రాజ్ అనే యువకునికి ముక్కు కి బలమైన గాయం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ రాజ్ కు ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కోరుట్ల పట్టణానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ అనూప్ రావు వెంటనే స్పందించారు. రేనీ ఆసుపత్రి డాక్టర్ సూచన మేరకు ఆపరేషన్ చేయాలనీ సూచించగా వెంటనే కరీంనగర్ లోని ప్రముఖ ఈ ఎన్ టి హాస్పిటల్ లో తన సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ కు సహకరించిన డాక్టర్ అనూప్ రావు కు కోరుట్ల భజరంగ్ దళ్ నాయకులు కళ్ళేడ రోహిత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మినారాయణ, రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, కౌన్సిలర్ ఇందూరి తిరుమల వాసు, బీజేపీ నాయకులు మాడవేణి నరేష్, సుదవేణి మహేష్, గిన్నెల శ్రీకాంత్, తులసి కృష్ణ, బేక్కం అశోక్, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.