కోరుట్ల, ముద్ర;
జగిత్యాల జిల్లా మేడిపల్లి శివారులోని మోహన్ రావు పేట బ్రిడ్జి సమీపంలో శుక్రవారం రోజు రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆరవెల్లి గ్రామానికి చెందిన గాలిపెల్లి ఆదిత్య 21 మహారాష్ట్ర భీవండి కి చెందిన విగ్నేష్ 17 లు ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై మల్లాపూర్ మండలంలోని ఒక శుభకార్యానికి వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో కోరుట్ల మండలం మోహనరావుపేట గ్రామ శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ వెనుక నుండి బలంగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదిత్య తల్లి అనురాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రోడ్డుపై నిర్లక్ష్యంగా ఎలాంటి సంకేతాలు లేకుండా లారీని నిలిపి ఇద్దరి మృతికి కారణమైన లారీ డ్రైవర్ తిరుపతి మీద కేసు నమోదు చేశారు. ఘటనపై కోరుట్ల సీఐ సురేష్ బాబు దర్యాప్తు ప్రారంభించారు.