కోరుట్ల, ముద్ర;
కోరుట్ల బార్ అసోసియేషన్ ఎన్నికలు శనివారం రోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు శాంతియుతంగా నిర్వహించారు. సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులుగా ఎం.డి. మెబీన్ పాషా, గోసికొండ సురేష్, సూర్యనారాయణ ప్రసాద్ లు వ్యవహరించారు. ఈ ఎన్నికలలో బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా తోట ఆంజనేయులు, కార్యదర్శిగా సుతారి శ్రీనివాస్,
కోశాధికారిగా చింతకింది ప్రేమ్ కుమార్, ఉపాధ్యకులుగా అంబల్ల నాగ నిర్మల ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన వారిని జూనియర్ సివిల్ జడ్జి కాసుల పావని, అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.