నాగర్ కర్నూల్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం ఎమ్మెల్యే డా. కూచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్ పట్టణంలోని నెల్లికొండ క్రాస్ రోడ్డులో గల వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచ్చుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను విక్రయించుకునేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి రైతులు, సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈవో పున్నమినరేష్ కుమార్ పర్సన్ ఇంచార్జ్ గణేష్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, వైస్ చైర్మన్ జంగయ్య, మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, డైరెక్టర్లు, ఉజ్వల్ కుమార్ రైతులు, నాయకులు పాల్గొన్నారు.