Take a fresh look at your lifestyle.

సిర్సనగండ్ల రామచంద్రుని సేవలో మంత్రి జూపల్లి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ.. ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలోని రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన సిర్సనగండ్ల క్షేత్రం శనివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు, దేవస్థాన అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు.


స్వామివారి సన్నిధిలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే స్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికను (పోస్టర్) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టనున్న పలు మౌలిక సదుపాయాల పనులకు భూమిపూజ చేశారు.
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని, సిర్సనగండ్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.