Take a fresh look at your lifestyle.

కొండపల్లిలో ‘పోక్సో’ చట్టంపై న్యాయ అవగాహన సదస్సు

ముద్ర, జోగుళాంబ గద్వాల‌ జిల్లా ప్రతినిధి:
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ‘జాగృతి పథకం – 2025’ కింద “సురక్షిత బాల్యం – సురక్షిత భవిష్యత్” అనే అంశంపై మంగళవారం కొండపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోక్సో (POCSO) చట్టంపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. చిన్నారుల హక్కుల పరిరక్షణ, బాలలపై జరిగే లైంగిక వేధింపుల నివారణపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
​ఈ సదస్సులో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రతినిధి వి. రాజేందర్ మాట్లాడుతూ, పిల్లల భద్రతకు సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. వేధింపులకు గురవుతున్న పిల్లల విషయంలో ఆలస్యం చేయకుండా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. విద్యార్థులు భయం వీడి తమ సమస్యలను తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయులతో పంచుకోవాలని సూచించారు. అనంతరం గ్రామస్తుల సందేహాలను నివృత్తి చేశారు.
​ఈ కార్యక్రమంలో లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బి. శ్రీనివాసులు, డి. లక్ష్మణ స్వామి, ప్యానెల్ అడ్వకేట్ వేంకటేశ్వర రెడ్డి, గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి దర్శల్లి, ఏ.ఈ.ఓ అనూష, పాఠశాల విద్యార్థులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.