Take a fresh look at your lifestyle.

యూనిటీ పీజీ కళాశాలలో భావోద్వేగా మేధస్సు వర్క్ షాప్ 

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మండల పరిధిలోని రాయగిరి గ్రామంలో గల యూనిటీ పీజీ కళాశాలలో  మొదటి, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు అంతర్గత నైపుణ్యాలు, భావోద్వేగా మేధస్సు ద వర్క్ షాప్ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నిర్మాణ్  ఆర్గనైజేషన్ డి  వీరమూర్తి  మాట్లాడుతూ ఎంబీఏ విద్యార్థులకు తమలో ఉన్న అంతర్గత నైపుణ్యాలు భావోద్వేగా మేజస్సుతో తమ వృత్తి విద్యలో,విశ్వవ్యాప్తంగా గొప్ప స్థాయికి చేరుకోవచ్చు అని న్యూ స్టార్ట్ అప్ చేసేటప్పుడు నైపుణ్యాలు మేధస్సు ఎంతగానో ఉపయోగపడి వాళ్ళ జీవితంలో  విజేతలుగా ఎదగవచ్చు అని అభిప్రాయపడ్డారు.వ్యాపార ప్రారంభ దశలో ఉండేటువంటి సమస్యలు పరిష్కారాలు విలువైన సూచనలు విద్యార్థులకు అర్థవంతంగా చెప్పారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఏ ప్రభాకర్ రెడ్డి, డైరెక్టర్ సోమచంద్, డైరెక్టర్ పి గోవర్ధన్ రెడ్డి, ఎంబీఏ ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఎస్ సరిత, ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ శ్రీనివాస్, కళాశాల ఏఓ పి సునీత, కళాశాల హెచ్వోడి జి సురేష్, అధ్యాపక బృందం వీ రాధ, వీ.లతా, సంపత్, నాగరాణి, యమునా, నరేందర్, ఉమా, క్రాంతి కుమార్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.