- జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం కోసం నిరంతర పోరాటం.
- జర్నలిస్టుల సమస్యలపై పలు తీర్మానాలు.
- టి యు డబ్ల్యూ జే ఐ జేయు నేషనల్ కౌన్సిల్ సభ్యుడు నగునూరి శేఖర్.
రామగిరి, ముద్ర: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాలుగో స్తంభంగా పిలవబడుతున్న పత్రికలు మీడియా సంస్థలే పట్టుకొమ్మలుగా నిలుస్తున్నాయని ఐ జే యు నేషనల్ సభ్యుడు నగునూరి శేఖర్ అన్నారు.జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అలాగే అర్హత కలిగిన ప్రతి పాత్రికేయునికి ఇళ్ల స్థలాల కై పోరాటం చేస్తామని టి యు డబ్ల్యూ జే ఐ జే యు నేషనల్ కౌన్సిల్ సభ్యుడు నగునూరి శేఖర్ అన్నారు. ఆదివారం రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సాయిరాం గార్డెన్ లో టి యు డబ్ల్యూ జె ఐజెయు జిల్లా కార్యవర్గ మొదటి సమావేశం సమావేశం జిల్లా అధ్యక్షుడు మల్లోజుల వంశీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగునూరి శేఖర్ హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన పాత్రికేయుల సమస్యలు మాత్రం పరికరం కావడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ చెబుతున్న హామీలు ఆచరణ అమల్లో విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై సానుకూల దృక్పథం పరిష్కరించే విధంగా త్వరితగతిన సమస్యల పరిష్కరించాలని అన్నారు. పాత్రికేయుల సమస్యలు రాష్ట్ర యూనియన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే పాత్రికేయులకు టోల్ గేట్ వద్ద వాహనాలకు ఎటువంటి రుసుము లేకుండా పంపించాలని ఆయన అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పాత్రికేయుల పిల్లలకు 50% రాయితీ ఇవ్వాలని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రతి అక్రిడేషన్ విలేఖరికి రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేసేలా జీవోను తేవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కోల లచ్చన్న, జిల్లా కోశాధికారి తగరం రాజు, జిల్లా కార్యదర్శి జబ్బర్ ఖాన్, జ్యోతుల ప్రవీణ్, ఉపాధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్ గౌడ్, ముత్యాల నరసయ్య, పతంగుల రవి, మరియు పాలకుర్తి విజయకుమార్,కార్యవర్గ సభ్యులు గాదే బాలయ్య, చింతం కిరణ్, మల్యాల రమేష్, సీనియర్ పాత్రికేయుడు పివి రావు, సమ్మయ్య, పోలు మధు, తిరుపతి రెడ్డి, సూత్రం శ్రీధర్, జక్కం సత్యనారాయణ, డబ్బేటా శంకర్, మల్లేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.