Take a fresh look at your lifestyle.

భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

  • జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్.

ముద్రా ప్రతినిధి, కల్వకుర్తి:పెండింగ్లో ఉన్న భూ భారతి ధరఖాస్తులు త్వరగతిన పరిష్కరించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.ఆదివారం కల్వకుర్తి తహసిల్దార్ కార్యాలయంలో కల్వకుర్తి రెవిన్యూ డివిజన్ పరిధిలోని మండలాల తహసీల్దార్లతో భూ భారతి దరఖాస్తులపై కల్వకుర్తి ఆర్డిఓ శ్రీను తో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి ద్వారా భూమి వివాదాలు తగ్గి రైతులకు, భూ యాజయానులకు శాశ్వత న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.భూ దరఖాస్తుల తిరస్కరిస్తే కారణాలను రాతపూర్వకంగా ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.కల్వకుర్తి రెవిన్యూ డివిజన్ పరిధిలోని కల్వకుర్తి, వెల్దండ, వంగూరు, ఊర్కోండ, చారకొండ మండలాల్లో 73 రెవిన్యూ గ్రామాల నుండి 3126 దరఖాస్తులు వచ్చాయని, 2040 దరఖాస్తులకు నోటీసులు అందజేయడం జరిగిందని, 1846 దరఖాస్తులను ఆమోదించడం, 1280 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని ఆర్డీవో శ్రీను జిల్లా కలెక్టర్ కు వివరించారు.
ఈ సమావేశంలో తహసిల్దారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.