Take a fresh look at your lifestyle.

అంగన్ వాడి కేంద్రంలో గర్భిణీలకు శ్రీమంతం పిల్లలకు అన్నప్రసాన

గొల్లపల్లి, ముద్ర : జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని ఇబ్రహీంనగర్ సెక్టార్ పరిధిలో సిడిపిఓ విరలక్ష్మి సూపర్వైజర్ జ్యోతి ఆధ్వర్యంలో శుక్రవారం రాఘవపట్నం, రాపల్లి, శంకర్రావుపేట, వేనుగుమట్ల ఇబ్రహీం నగర్, ఇశ్రాజపల్లి, బొంకూరు, బి బి రాజు పల్లి అంగన్వాడి సెంటర్లలో గర్భవతులకు శ్రీమంతాలు పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించిన్నారు.ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ,తల్లులకు సరైన పోషణ పోషకాహారం గురించి తగు సలహాలు సూచనలు వారికి తెలిపారు. పిల్లలకు ఆరు నెలలు నిండిన తర్వాత అనుబంధ పోషకాహారం అందించాలని తల్లులకు చెప్పడం జరిగిందాని వారు అన్నారు. ప్రతినెల అంగన్వాడి కేంద్రానికి పిల్లలను తీసుకొని వచ్చి పిల్లల బరువులను ఎత్తులను చూపించుకోవాలని వారికి వివరించి చెప్పడం జరిగిందాని అన్నారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ వీరలక్ష్మి , సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడీ టీచర్లు వి. రమాదేవి, ఎస్ రమాదేవి, జలజ, స్వప్న,రాజేశ్వరి,లక్ష్మి, టి రమాదేవి ,హేమలత ,పద్మ, సత్యమ్మ, విజయ, సాయి లత,సునీత, శాంత, శ్యామలత తల్లులు పిల్లలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.