Take a fresh look at your lifestyle.

రైతులకు విత్తనాల పంపిణీ

అచ్చంపేట, ముద్ర విలేఖరి: తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం రైతులకి విత్తనాల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ , మరియు సంధ్యారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా చేపట్టిన విత్తనాల పంపిణీ కార్యక్రమం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రైతుల కోసం వడ్లు, జొన్నలు, రాగులు, కందులు, మినుములు మొదలగు విత్తనాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హాజరయ్యారు. వారితో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంధ్య రెడ్డి కూడా పాల్గొన్నారు.ఈ విత్తనాల పంపిణీ కార్యక్రమం రైతులకి ఎంతగానో ఉపయోగపడుతుందని, సాగునీటి సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు అధిక దిగుబడి సాధించేందుకు ఇది దోహదపడుతుందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణసార్ ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం మరెన్నో పథకాలు ఇస్తుందని మరొకసారి గుర్తు చేశారుఈ కార్యక్రమంలో బల్మూర్ మండల పార్టీ అధ్యక్షుడు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, ఓ బి సి జిల్లా చైర్మన్ గిరి వర్ధన్ గౌడ్, బల్మూరు మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ గౌడ్, మాజీ సర్పంచి నర్సింగ్ రావు,మాజీ ఎంపిటిసి ఖదీర్, మండల్ ప్రధాన కార్యదర్శి సంపంగి రమేష్,సుధాకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు మశన్న, మరియు ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.