Take a fresh look at your lifestyle.

అధిరి డిజి ప్రెస్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి.

 

ముద్ర,  హైదరాబాద్ జిల్లా:

సూక్ష్మ , మైక్రో రంగాలలో మహిళా పారిశ్రామికవేత్తలను ఎక్కువగా ప్రోత్సహించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాలించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం

జిల్లాలో అర్హులైన మహిళలకు సూక్ష్మ, మైక్రో పారిశ్రామిక యూనిట్లను ఎక్కువగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం సికింద్రాబాద్ సీతాఫల్ మండి లో పిఎంఈజీపి కింద మంజూరైన అధిరి డి.జి ప్రెస్ ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని, జిల్లాలో సూక్ష్మ, మైక్రో పారిశ్రామిక రంగాలలో మహిళా పారిశ్రామికవేత్తలను ఎక్కువగా ప్రోత్సహించి అర్హత మేరకు యూనిట్లను గ్రౌండ్లింగ్ చేయాలని , అలాగే యూనిట్ల మంజూరులో పారదర్శకత తప్పక పాటించాలని సూచించారు . గత సంవత్సరంలో వివిధ విభాగాలలో 33 యూనిట్లను అందజేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగంలో అనుభవం అర్హత కలిగిన మహిళలు ముందుకు రావాలని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

అనంతరం అధిరి డిజి ప్రెస్ ను నిర్వాహకులు తో కలిసి కలెక్టర్ ఈ సందర్భంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పవన్ కుమార్, ఎల్ డి ఎం పి. ఎన్ .వి. ఎల్ .మూర్తి, ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు వల్లాల రేణుక, అరుణ్ కుమార్, బంధుమిత్రులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.