Take a fresh look at your lifestyle.

రెండు రైస్ మిల్లులపై చర్యలు అలసత్వంపై కలెక్టర్ ప్రతిమా సింగ్ సీరియస్

ముద్ర ప్రతినిధి, మెదక్:
ధాన్యం దిగుమతులలో అలసత్వం వహించిన మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు.
రబీ మార్కెటింగ్ సీజన్ 2025-26 (యాసంగి) సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు అన్ని రైస్ మిల్లర్లు పీపీసీల నుండి ధాన్యాన్ని దిగుమతి చేసుకొని కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని పలుమార్లు ఆదేశించినా స్పందన లేదన్నారు.
మేసర్స్ శ్రీ సాయి లక్ష్మీ ట్రేడర్స్, మేసర్స్ భవాని ఇండస్ట్రీస్ కు పీపీసీల నుండి కేటాయించిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలను పాటించడం లేదని గమనించారు. దీనివల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. రైస్ మిల్లులను పాడి ప్రొక్యూర్‌మెంట్, కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్ నుండి తక్షణ ప్రభావంతో బ్లాక్‌లిస్ట్ చేయడం జరిగిందని, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయా రైస్ మిల్లులకు ఎటువంటి ధాన్యం కేటాయింపు చేయబడవని వెల్లడించారు.
ధాన్యం మిల్లులకు తరలించేలా చర్యలు
రైతుల ధాన్యాన్ని సమయానికి తూకం వేసి సంబంధిత మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
రామాయంపేట మండలం అక్కన్నపేటలో ఐకెపి
ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.
టోకెన్ విధానం అమలులో ఉందా? అనే అంశాన్ని పర్యవేక్షిస్తూ, నిబంధనలు పక్కాగా పాటించాలని సూచించారు. కేంద్రాల్లో , గోనె సంచులు సరిపడా అందుబాటులో ఉన్నాయా?అని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,32,992 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 533 కేంద్రాల్లో, 519 కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కోసం పనిచేస్తున్నాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.