- డి.సీతారాం.
గండిపేట్, ముద్ర విలేకరి: నాసిరకంగా రోడ్లు వేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మణికొండ మున్సిపాలిటీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ ద్వారా ల్యాంకో హిల్స్ మొదలుకొని లక్ష్మీ నగర్, అంజలీ గార్డెన్ వరకు 2022 లో రోడ్డు వేశారని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయం 2023 లో టీమ్స్ ఫోర్ ప్రాజెక్ట్ వారి స్వలాభం కోసం మణికొండ మున్సిపాలిటీ ల్యాంకో హిల్స్ దాటిన తరువాత లక్ష్మీ నగర్ మొదలుకొని అంజలీ గార్డెన్ వరకు రహదారి మధ్యలో డ్రైనేజ్ పెద్దలైన్ వేయడం కొరకు వారు రోడ్డును త్రవ్వడం చేసిన నిర్వాకం వలన ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. పై పెచ్చు నాలుగైదు పర్యాయాలు రోడ్డు కృంగిపోవడం ప్రజలు ఇబ్బందుల పాలవడం దరిమిలా మున్సిపాలిటీ అధికారులు అందుకు తగ్గట్టు తూతూ మంత్రంగా నాసిరకంగా మరమ్మత్తులు చేయడం మినహా అందుకు సంబంధించిన టీమ్స్ ఫోర్ ప్రాజెక్ట్ వారి వద్ద నుండి ఎలాంటి నష్ట పరిహారం వసూలు చేయకపోవడం పట్ల మండిపడ్డారు. అప్పటి మున్సిపాలిటీ ప్రజా పరి పాలకుల సభ (కౌన్సిల్) నిర్వాక ఫలితం అని స్థానికులు వాపోయారు. సంఘటితంగా భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు బుధవారం రోజున స్థానిక సమస్యలు తెలుసు కొవడానికి తిరగడం జరిగినది. ఇచ్చట ఇండ్ల మధ్యలో పర్యావరణ పరిరక్షణకు విరుద్ధంగా రెడీ మిక్స్ కాంక్రేట్ ప్లాంట్ నడుపుతు అందుకు సంబంధించిన వాహనాలు తిరగడంలో కూడా రోడ్డు ధ్వంసమౌతుందని, ఈ విషయమై స్థానికులకు భారత రాష్ట్ర సమితి మణికొండ మునిసిపాలిటీ మద్దతుగా ఉంటుందని తెలిపారు. ప్రజా పరిపాలన సమయం ముగిసిన ప్రస్తుత తరుణంలో రూ.60 లక్షల బడ్జెట్ తో రోడ్డును వేయడానికి పూనుకోవడం, ఈ మేరకు ప్రజాధనం దుర్వినియోగం పరచడమని తెలిపారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రజల మేలుకోరి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యదర్శి గుట్టమీది నరేందర్, ఉపేంద్రనాధ్ రెడ్డి, అందె లక్ష్మణ్ రావు, సంగం శ్రీకాంత్, యాలాల కిరణ్, భానుచందర్, మహమ్మద్ ఆరిఫ్, సుమనళిని, షేక్ ఆరీఫ్, శ్యామలేట్ రేఖ తదితరులు పాల్గొన్నారు.