Take a fresh look at your lifestyle.

కార్మిక హక్కులను కాలరాస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం

  • సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు.

సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: కార్మిక హక్కులను కాలరాస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వానికి గద్దె దించాలని. సమ్మె సందర్భంగా ఏఐటియు సి జిల్లా ఆఫీసు నుండి కొత్త బస్టాండ్ వరకు ఆశా వర్కర్లు, టైలరింగ్ యూనియన్, రిక్షా కార్మికులు, సివిల్ హమాలి యూనియన్ , యువజన సంఘం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరించిన ఆర్ధిక విధానాల కారణంగా, పేదరికం, అసమానతలు, ఆకలి, నిరుద్యోగం పెరిగాయన్నారు. మరొక వైపు, కార్పొరేట్ కుటుంబాల ఆస్తులు, సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని, ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి నాలుగు కార్మిక కోడ్లను అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించారన్నారు. కార్మికులు పోరాడి, అనేక త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులన్నిటినీ రద్దు చేయడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం కుయుక్తులు పన్నారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని, సుప్రీంకోర్టు తీర్పులనూ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలన్నిటినీ భూస్థాపితం చేయడమే పనిగా మోడీ ప్రయత్నం చేస్తున్నారన్నారు. కార్మిక కోడ్ లు అమలులోకి వస్తే ఎనిమిది గంటల పనిదినం, కనీస వేతనాలు, సామాజిక భద్రత, సంఘం పెట్టుకునే హక్కు సంఘాల రిజిస్ట్రేషన్లు-గుర్తింపు, సమిష్టి బేరసారాల హక్కు, సమ్మె హక్కు, ఆందోళనలు చేసే హక్కులు అన్నీ తీవ్రమైన ప్రమాదంలో పడిపోతాయని వారు ఆవేదన వ్యక్తంచేశారు. కార్మిక వర్గ హక్కులపై జరుగుతున్న దాడిని ప్రజలంతా ప్రజాస్వామ్యం పై దాడిగా భావించాలన్నారు. బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత) చట్టాలను పౌర హక్కులపై దాడికి ప్రయోగిస్తున్నారని. బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 111 ప్రకారం, కార్మికులు సంఘటితంగా తమ హక్కులను డిమాండ్ చేస్తే, దాన్ని సంఘటిత నేరంగా పరిగణించి, తీవ్రమైన జైలు శిక్షలు, పెనాల్టీలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు.కేంద్ర ప్రభుత్వ ఈ చర్యలన్నీ కార్పొరేట్లు అంబానీ, ఆదానీ ల ప్రయోజనాల కోసమే,చట్టాల సంస్కరణలు తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగు కార్మిక కోడ్ల రద్దుతో పాటు, రూ.26,000 కనీస వేతనం, 8గంటల పనిదినం, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఆశా, అంగన్వాడి తదితర స్కీం వర్కర్స్ రెగ్యులరైజేషన్, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశ నిర్వహణ, మరికొన్ని డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మె జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ ప్రాంతీయ అధ్యక్షులు దంతాల రాంబాబు, ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, నాయకులు పెండ్ర కృష్ణ, దీకొండ శ్రీనివాస్, యూత్ నాయకులు ఎడెల్లి శ్రీకాంత్, బూర సైదులు, పూన్నం రమేష్, దీకొండ రవి, వాడపల్లి వెంకన్న, ఆశా వర్కర్లు కవిత, అరుణ, హుస్సేన్ బి, గోవర్ధనమ్మ, రాధ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.