- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి.
ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : కల్వకుర్తి నియోజకవర్గం లో ఈ నెల 11న రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పార్లమెంటు సభ్యుడు మల్లురవి రూ , 189 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయనున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కొట్ర గేట్ నుండి కల్వకుర్తి పట్టణానికి నాలుగు వరుసల రహదారి, పట్టణంలో వంద పడకల ఆసుపత్రి, వెల్దండ నుండి సిరసనగండ్లకు, కొట్ర తండా నుంచి తలకొండపల్లి మార్గంలో రెండు వరసల రోడ్ల నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మాడుగుల మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసి 220 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేసినట్లు తెలిపారు. పట్టణంలో మహిళా సంఘాలకు బ్యాంకు నుండి ఆరు కోట్ల రుణాలను అందజేసే కార్యక్రమాలు ఉంటాయని అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో పొల్యూషన్ బోర్డ్ సభ్యుడు బాలాజీ సింగ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి,నాయకులు ఆనంద్ కుమార్ ,భూపతిరెడ్డి, సంజీవ్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, మోతిలాల్, తదితరులు పాల్గొన్నారు.