Take a fresh look at your lifestyle.

వైభవంగా ఆంజనేయస్వామి గుడి వార్షికోత్సవం 

 

ముద్ర, ఉమ్మడి 

మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :

……………………………………….

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని మర్లు ఎస్ ఆర్ నగర్ లో ఆంజనేయ స్వామి గుడి వార్షికోత్సవ కార్యక్రమం

అంగ రంగ వైభవంగా జరిగింది. గుడి నిర్మించి ఏడాది పూర్తయిన సందర్బంగా శనివారం గుడి వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.80 ఇత్తడి కళశాలతో ఐదుగురు పండితులు ప్రత్యేక పూజాలు చేశారు.కళశాలను పట్టుకుని మహిళలు ఆలయం చుట్టూ ప్రధక్షణలు  చేశారు.అనంతరం గుడి ప్రాంగణం లో హోమం నిర్వహించారు. ఆంజనేయ స్వామి మూల విగ్రహానికి అభిషేకం,అలంకరణ కార్యక్రమాలు చేపట్టారు.ఈ పూజా కార్యక్రమాలు కాలనీ వాసులు భక్తి శ్రద్దలతో నిర్వహించారు. తీర్థ ప్రసాదాల అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం లో కాలనీ పెద్దలు శ్రీకాంత్ గౌడ్,చంద్రారెడ్డి, లక్ష్మి నారాయణ, భాను ప్రకాష్,అనిల్, శంకర్ రెడ్డి, రాఘవేందర్, సుదర్శన్, శ్రీనివాస్ గౌడ్, గోపాల్, రాధికా గౌడ్, కవిత, లయ, చంద్రకళ, మంజుల, శ్వేత,కాలనీ మహిళలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.