- బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారి చేసే కార్డులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోటోను ముద్రించాలని బిజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి డిమాండ్ చేశారు. భారత ఆహార భద్రత చట్టం ప్రకారం నిరుపేదలకు పదివేల కోట్లు సబ్సిడీ ఇచ్చి ఉచితంగా కేంద్రం బియ్యం పంపిణి చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వం గొప్ప అని చెప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. పేదలకు ఇస్తున్న ప్రతి కిలో బియ్యం మీద కేంద్రం రూ. 40 ఖర్చు చేస్తుందని, తెలంగాణలోని పేదల కోసం ఏడాదికి కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రధానమంత్రి ఫోటోను పెట్టకుండా కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోందన్నారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని పేదలందరికీ ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్న విషయాన్ని గురించి బిజేపీ కార్యకర్తలు ప్రజలకు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. గత అయిదు సంవత్సరాలుగా కరోనా సమయం నుండి తెలంగాణాలోని మూడు కోట్ల యాభై లక్షల మందికి ప్రతి నెల కేంద్ర ప్రభుత్వం తరుపున నెలకు 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కేవల 1 కిలో మాత్రమే బియ్యం ఇస్తూ 6 కిలోలు బియ్యం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నామని చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు.