ముద్ర, తెలంగాణ బ్యూరో : ఛత్తీస్‌గఢ్ కాంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీ దామోదర్ మరణించలేదని తెలిపింది. 8వేల మంది పోలీసుల ఏకపక్ష దాడిలో 4గురు గ్రామస్థులు చనిపోయినట్లు సమత ప్రవక్త పేరుతో రిలీజ్ చేసిన లేఖలో స్పష్టం చేసింది.ఈ మేరకు పార్టీ దక్షిణ సబ్ జోనల్ బ్యూరో సమత, మావోయిస్టు డివిజన్ కమిటీ గంగ పేరుతో పోలీసులు నకిలీ ప్రెస్ నోట్ విడుదల చేశారని అధికారిక లేఖలో పేర్కొంది. ఈ మేరకు శనివారం భారత కమ్యూనిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ బ్యూరో సమత ప్రవక్త పేరుతో లేఖ విడుదల చేసింది. పోలీస్ శాఖ మావోయిస్టు పార్టీ పేరుతో ప్రకటనలు చేసి ప్రజల్లో సందేహాలు, నిరాశలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడింది.
తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర ఇంచార్జ్ కామ్రేడ్ దామోదర్ క్షేమంగా ఉన్నట్లు చెప్పింది. బీజాపూర్ జిల్లా ఉసూర్ పరిధిలోని సింగవరం, తుండేపల్లి, మల్లెంపేట పూజారి కాంకేర్ గ్రామాలపై 8 వేల మంది పోలీస్ బలగాలు దాడి చేసినట్లు తెలిపింది. ఆపరేషన్ కగార్ పేరుతో యుద్ధం చేపట్టిన ప్రభుత్వం తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర బలగాలు అరాచకం సృష్టిస్తున్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది. పోలీసులు కావాలనే ఫేక్ లెటర్ క్రియేట్ చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మరణించారని వెల్లడించింది. వారిలో నలుగురు మావోయిస్టులు కాగా మరో నలుగురు గ్రామస్తులు ఉన్నారని తెలిపింది.
ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర బలగాలు అరాచకం సృష్టిస్తున్నాయని మావోయిస్టు పార్టీ పేర్కొంది. జనవరి 16,17వ తేదీల్లో 8వేల మంది భద్రతా బలగాలతో 4 గ్రామాలపై పోలీసులు దాడులకు పాల్పడ్డారని చెప్పింది. జనాల్లో అయోమయం సృష్టించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారని విమర్శించింది. పోలీసులు బూటకపు ప్రకటనలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దామోదర్, ఇతర సహచరులు క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసింది. అయితే ఇటీవల దామోదర్ తన సహచరులకు ఫోన్ చేసి క్షేమంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.