Take a fresh look at your lifestyle.

కాల్వల పునర్నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి :
నియోజకవర్గంలోని భూనాదిగాని, ధర్మారెడ్డిపల్లి, పిల్లయిపల్లి కాలువల పునర్నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నీటిపారుదల, రెవిన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భువనగిరి నియోజక వర్గం వ్యాప్తంగా సాగు నీటి కాల్వల పునర్నిర్మానాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాల్వలకు భూసేకరణ పూర్తి చేయాలని, కాల్వల వెంబడి ఉన్న విద్యుత్ స్థంబాల ట్రాన్స్ఫర్మర్ ల ను పక్కకు తీసి త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడానికి కృషి చేయాలన్నారు.
నియోజకవర్గంలో ఉన్న బోల్లేపల్లి, భీమలింగం, అలీనగర్ కాల్వల పునర్నిర్మాణాల కొరకు కావాలిసిన అంచనాలను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఎస్ ఈ రవీందర్, భువనగిరి ఆర్డిఓ కృష్ణ రెడ్డి, ఎస్ డి సి (భూసేకరణ) జగన్నాధ రావు, నీటి పారుదల శాఖ ఈఈ లు శైలెందర్, ఖుర్షిద్ డిఈ,ఏఈ లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.