Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఆత్మగౌరవం సర్ధార్ పాపన్న

  • రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి సంగీత.
  • కలెక్టరేట్లో ఘనంగా పాపన్న 315వ వర్ధంతి వేడుకలు.

ఉమ్మడి రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: సర్దార్‌ స‌ర్వాయి పాప‌న్న తెలంగాణ వీరుడుని.. తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌరమని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత అన్నారు. బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న 315వ వర్దంతి సందర్బంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని బి.సి.సంక్షేమ శాఖ కార్యాలయంలో బి. సి. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సర్దార్ సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళు ఆర్పించారు.ఈ సందర్బంగా డిఆర్ఓ మాట్లాడుతూ..తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది స‌ర్దార్ సర్వాయి పాపన్నననే తెలిపారు. అతి సామాన్యమైన జీవితం నుంచి అత్యంత ఉన్న‌త స్థాయికి ఎదిగిన వ్య‌క్తి అని, క‌ల్లుగీత కార్మికుడైన స‌ర్దార్ సర్వాయి పాపన్న సైన్యాన్ని స‌మ‌కూర్చుకుని, రాజుల‌ను ఎదిరించి, యుద్ధాలు చేసి, రాజ్యాల‌ను స్థాపించి, ప‌రిపాలించ‌డం చ‌రిత్ర‌లో ఓ అరుదైన విష‌యం అని అన్నారు. స‌ర్వాయి పాప‌న్న యాదృచ్చికంగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న నుంచి సొంత సైన్యాన్ని స‌మ‌కూర్చుకుని మొఘ‌లాయిల‌ను ఎదురించిన మొట్ట‌మొద‌టి తెలంగాణ రాజు స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న అని, ఆ త‌ర్వాత 33 రాజ్యాల‌ను స్థాపించాడ‌న్నారు. జీవించిన‌న్ని రోజులూ రాజుగానే జీవించాడ‌న్నారు.అలాంటి అద్భుత వ్య‌క్తి మ‌న తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ ఆద‌ర్శ ప్రాయుడ‌ని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి బి. కేశురాం, కలెక్టరేట్ ఏఓ సునీల్, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు పి. రమేష్, వై. మాధవ రెడ్డి, కుల సంఘం నేతలు బోయపల్లి సుధాకర్ గౌడ్, నర్సింహ గౌడ్, బండి రాజు గౌడ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.