- ఎవరూ ఆందోళన చెందవద్దు.
- పూర్వ వీఆర్ఏల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాట భాస్కర్.
ఉమ్మడి రంగారెడ్డి ముద్ర ప్రతినిధి: వీఆర్ఓ, వీఆర్ఏలు రెవెన్యూ సంబధిత శాఖల్లోనే సర్దుబాటు అవుతారని ఎవరు అధైర్య పడవద్దని పూర్వ వీఆర్ఏల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాట భాస్కర్ సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ..పాత రికార్డు ప్రకారంగా జిల్లాలో 1456 వీఆర్ఓ, వీఆర్ఏలు ఉన్నారని చెప్పారు.ఇతర శాఖల్లో 934 మంది ఉద్యోగులకు ఇప్పటికే ప్రభుత్వం సర్దుబాటు చేసినట్లు చెప్పారు.మిగతా ఉద్యోగుల్లో 5 శాతం మంది పదవి విరమణ పొందినా మిగిలిన వారిని ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ వ్యవస్థలొనే కొనసాగుతారని అన్నారు. కాబట్టి విఆర్వో, విఆర్ ఏ ఉద్యోగులు ఎవరు కూడా అధైర్య పడవద్దని యాట భాస్కర్ స్పష్టం చేశారు.