Take a fresh look at your lifestyle.

మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి : సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్

చలో హైదరాబాద్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన నగేష్
ముద్ర, చిట్యాల :
మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెలుతున్న చిట్యాల మున్సిపల్ కార్మికుల ర్యాలీని ఆయన మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కనీస వేతనం అందించాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అవిశెట్టి శంకరయ్య, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ సభ్యులు పాల లక్ష్మయ్య, జిల్లా కమిటీ సభ్యులు మేడి శోభ, జనపాల జ్యోతి, యమున, అండాలు, ధనలక్ష్మి, వరమ్మ, కిషన్, శేఖర్,రమణ, నరేష్, యాదయ్య పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.