పీజీఈసెట్ ఎగ్జామ్ డేట్స్ ఫిక్స్
రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఆధ్వర్యంలో నిర్వహించే TG EAPCET–2026 షెడ్యూల్‌ను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఎలాంటి ఆలస్య (Without Late Fee) రుసుము లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షల విషయానికొస్తే.. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్ & ఫార్మసీ విభాగానికి, మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్ విభాగానికి ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.
పీజీఈసెట్ షెడ్యూల్ వివరాలు..
మరోవైపు, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH), ఉన్నత విద్య మండలి సంయుక్తంగా TG PGECET–2026 షెడ్యూల్‌ను కూడా ఖరారు చేశాయి. దీనికి సంబంధించి తొలి సెట్ (CET) కమిటీ సమావేశం నిర్వహించి షెడ్యూల్‌కు ఆమోదం తెలిపారు. ఈ పరీక్ష నోటిఫికేషన్ జనవరి 30, 2026 (శుక్రవారం) న విడుదలవుతోంది. ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమై, ఫిబ్రవరి 27 వరకు లేట్ ఫీజు లేకుండా స్వీకరించబడతాయి. మే 6న హాల్ టికెట్లు విడుదల చేయనుండగా, మే 28 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
TG EAPCET–2026 (ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ)
నోటిఫికేషన్ విడుదల తేదీ: ఫిబ్రవరి 14, 2026.
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభం.
చివరి తేదీ: ఏప్రిల్ 4, 2026 (ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా).
పరీక్ష తేదీలు: * అగ్రికల్చర్ & ఫార్మసీ: మే 4, మే 5.
ఇంజినీరింగ్: మే 9 నుంచి మే 11వ తేదీ వరకు.
TG PGECET–2026 (పీజీ కోర్సులు)
నోటిఫికేషన్ విడుదల: జనవరి 30, 2026 (శుక్రవారం).
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 23, 2026 (సోమవారం) నుంచి ప్రారంభం.
చివరి తేదీ: ఫిబ్రవరి 27, 2026 (ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా).
హాల్ టికెట్లు: మే 6, 2026 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష తేదీలు: మే 28 నుంచి మే 31 వరకు (గురువారం నుంచి ఆదివారం వరకు).
తెలంగాణ టెట్ (TET) అప్‌డేట్స్
ఇక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) కు సంబంధించి కూడా కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 3 నుంచి 20 వరకు నిర్వహించిన టెట్ పరీక్షల ప్రాథమిక కీని అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు ఈ కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వచ్చే నెల 31వ తేదీ వరకు ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఇచ్చారు.
ప్రాథమిక కీ: ఈ నెల (జనవరి) 3 నుండి 20 వరకు జరిగిన పరీక్షల ప్రాథమిక కీ విడుదలయ్యింది.
అభ్యంతరాలు: విడుదలైన కీపై అభ్యంతరాలు తెలపడానికి మార్చి 31, 2026 వరకు గడువు కలదు.
ఈఏపీసెట్ నోటిఫికేషన్ విడుదల అయింది.
తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈ మేరకు పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 14న ఈఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం అవుతాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 4, 2026వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆయా పరీక్షలకు సంబంధించి కన్వీనర్లను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్, బీ ఫార్మసీ వంటి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో సీట్ల భర్తీకి ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈఏపీసెట్ 2026) నోటిఫికేషన్ విడుదల చేసారు. షెడ్యూల్ ప్రకారం ఈఏపీసెట్ 2026 అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు మే 4, 5 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయి. మే 9 నుంచి జూన్ 11 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు జరుగుతాయి. కాగా ఈ ఏడాదికి కూడా ఈ ఏడాదికి కూడా జేఎన్టీయూ-హైదరాబాద్ ఆధ్వర్యంలోనే TG EAPCET 2026 పరీక్ష జరగనుంది. ఎప్‌సెట్‌లో భాగంగా తొలి రెండు రోజులు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహిస్తారు, మే 9వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులపాటు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసారు. అమ్మాయిలు సాధ్యమైనంత వరకు ఉదయం వేళల్లో జరిగే పరీక్షలు రాసేలా, నగరంలోని ఎగ్జామ్సెంటర్లను కేటాయించడంపైనా దృష్టి సారించారు.
పరీక్షల తేదీలు
ఇక, మధ్యాహ్నం షిఫ్ట్‌లో జరగనున్న పరీక్షలు సాయంత్రం 6 గంటలకు పూర్తవుతాయి. కొన్ని అనివార్య పరిస్థితుల్లో కొద్దిసేపు కంప్యూటర్లు పనిచేయకపోవడం లాంటి సందర్భాల్లో మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయిలు ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడకూడదన్నది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. ఈసారి సెట్ల దరఖాస్తు ఫీజుల్లో ఎటువంటి మార్పు లేదు. జోసా షెడ్యూల్ తదితర వాటిని పరిగణనలోకి తీసుకొని వీలైనంత మేరకు త్వరగా ప్రవేశాల ప్రక్రియ జరుపుతామని ఛైర్మన్ వెల్లడించారు. ఇక..ఫిబ్రవరి 14న ఈఏపీసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంఅవుతాయని వెల్లడించారు. ఇక, ఏప్రిల్ 4వ తేదీ ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ గా నిర్ణయించారు. అయితే.. మే 4, 5, 9, 10, 11 తేదీల్లో ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీలుగా ప్రకటించారు.