మార్చి బడ్జెట్‌లో సాగు, త్రాగునీరు, మూసీ ప్రక్షాళన, విద్య–వైద్యానికి తగిన నిధులు కేటాయించాలి: సీపీఎం నేత యండి జహంగీర్
మార్చి నెలలో ప్రవేశపెట్టి బడ్జెట్ లో సాగు , త్రాగునీరు, మూసీ కాలుష్యం, విద్య , వైద్యం, రహదారులు, ఉపాధి, మౌలిక అంశాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :

మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే 2026 – 27 వార్షిక బడ్జెట్లో యాదాద్రి భువనగిరి జిల్లా సాగు , త్రాగునీరు కోసం , మూసీ జల కాలుష్య నివారణకు, విద్య , వైద్యం, రహదారులు , ఉపాధి, మౌలిక అంశాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2026 – 27 వార్షిక బడ్జెట్ లో జిల్లా అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి జహంగీర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యంత కీలకమైన బస్వాపురం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి ఈ బడ్జెట్ లో 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని అన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు 90% పైగా పూర్తయిందని మిగతా పని పూర్తి కావాలన్నా , నిర్వాసితులకు పూర్తిస్థాయి నష్టపరిహారం అందాలన్నా వెంటనే నిధులు కేటాయించాలని కోరారు. ప్రాజెక్టు పూర్తయితే 10 మండలాలలోని లక్ష ఎకరాలకు పైగా భూమి సాగులోకి వస్తుందని తెలిపారు. మరోపక్క డిండి ఎత్తిపోతల పరిధిలోని శివన్నగూడెం ప్రాజెక్టు పనులకు, నిర్వాసితులకు నష్టపరిహారానికి కూడా నిధులు కేటాయించాల న్నారు. నారాయణపురం మండలానికి సంపూర్ణంగా నీళ్లు ఇవ్వడం కోసం రాచకొండ ఎత్తిపోతలకు నిధులు కేటాయించాలని సూచించారు. గంధమల్ల ప్రాజెక్ట్ కు నిధులు కేటాయించామని ప్రభుత్వం చెప్తుందని కేవలం కొంతమంది భూ నిర్వాసితులకు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని మిగతా నిర్వాసితులతో పాటు ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యమంత్రి మూసీ ప్రక్షాళ చేసి రసాయన పరిశ్రమల కాలుష్యం, వ్యర్ధాలు, మురికి నీరు కలవకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి సంవత్సరంపైగా గడుస్తున్న ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. ఇప్పటికైనా సంగెం, నెమిలెకాల్వ, ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి, బునాదిగాని కాల్వల పరిధిలలో ఎస్.టి.పి ల నిర్మాణానికి తగిన నిధులు కేటాయించాలని సూచించారు. జిల్లా కేంద్రంలో నేటికీ ప్రభుత్వ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కాలేజీలు లేవని ఈ బడ్జెట్ లో నన్న తగిన నిధులు కేటాయించి భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు చౌటుప్పల్ పట్టణంలో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ ఎక్యుప్ మెంట్స్, లాప్రోస్కోపీ మొదలగు పరికరాల కొనుగోలుకు సమగ్ర నిధులు ఇవ్వాలని కోరారు. యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజీ భవనం త్వరితగతిన పూర్తి చేసి రామన్నపేట, మోత్కూరు, ఆలేరు మండల కేంద్రాలలో వంద పడకల ఆసుపత్రుల నిర్మాణానికి తగిన నిధులు బడ్జెట్లో కేటాయించాలని అన్నారు. చిట్యాల – భువనగిరి ప్రధాన రహదారి విస్తరణకు తగిన నిధులు కేటాయించి ప్రజలను కాపాడాలని, ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు నిధులు కేటాయించి ప్రకటించాలని, గ్రామీణ అంతర్గత రోడ్లు, దళిత వాడలు, గిరిజన తండాల అభివృద్ధికి నిధులు కేటాయింపు మరియు జిల్లా కేంద్రంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీస్ ఇన్స్ పెక్టర్ ఆఫీస్, డి.సి.ఎల్ ఆఫీస్, పి.ఎఫ్. ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసులు మంజూరు చేసి ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినారు. నిధుల సాధనకు జిల్లాలో ఉన్న ఐదుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు బాధ్యత తీసుకోవాలని జహంగీర్ వారికి సూచించినారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ , బట్టుపల్లి అనురాధ పాల్గొని మాట్లాడగా, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బొలగాని జయరాములు, మాయ కృష్ణ, గంగాదేవి సైదులు, ఎంఏ. ఇక్బాల్, మధ్యపురం రాజు, ఆలేరు మండలం కార్యదర్శి ధూపాటి వెంకటేష్, బొమ్మలరామారం మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం, తుర్కపల్లి మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్, యాదగిరిగుట్ట పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్ రెడ్డి తోపాటు ఈర్లపల్లి ముత్యాలు, లావుడియా రాజు, వనం రాజు, గంధమల్ల మాతయ్య, బందెల ఎల్లయ్య, కొండమడుగు నాగమణి, చింతల శివ, బర్ల వెంకటేష్, కొండాపురం యాదగిరి, ఉస్మాన్ షరీఫ్, వల్దాస్ అంజయ్య, ఎదునూరి వెంకటేష్, బోడ అంజయ్య, ఎండి. బాబు పాల్గొన్నారు.