Take a fresh look at your lifestyle.

సోష‌ల్ మీడియాను పెడ‌దోర‌ణుల‌కు వాడుకోవ‌ద్దు… ఎమ్మెల్యే కెపి వివేకానంద‌

 

ట్ర‌ప‌సా ఆధ్వ‌ర్యంలో ప‌ద‌వ‌త‌ర‌గతి విద్యార్థుల‌కు కేరీర్ గైడెన్స్‌

విద్యార్థుల‌కు సూర్తి నిచ్చిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మాజీ డైరెక్ట‌ర్ బాల‌ల‌త జీవిత‌పాఠం

ముద్ర, కుత్బుల్లాపూర్:

స్పూర్తిదాయ‌క‌మైన వ్య‌క్తుల జీవితాల కోసం తెలుసుకునేందుకు సోష‌ల్ మీడియాను స‌ద్వినియోగ చేసుకోవాల‌ని విద్యార్థుల‌కు టిఆర్ ఎస్ ఎల్పీ విప్‌, కుత్బుల్లాపూర్ శాస‌న‌స‌భ్యులు కెపి వివేకానంద సూచించారు. తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొందిన అఫ‌ర్డ‌బుల్ ప్రైవేటు పాఠ‌శాల‌ల యాజ‌మాన్యం (ట్ర‌ప‌సా) గ్రేట‌ర్ కుత్బుల్లాపూర్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ధ‌నిక్ భార‌త్ ఎడ్యుకేష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌న్స్ స‌హాకారంతో ప‌ద‌వ‌త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు కేరీరి గైడెన్స్‌, మోటివేష‌న‌ల్ త‌ర‌గ‌తిని గాజుల‌రామారంలోని ప‌ద్మావ‌తి గార్డెన్స్‌లో గురువారం జ‌రిగింది. కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ కేరీరి గైయిడ్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మాజీ డైరెక్ట‌ర్ బాల‌ల‌త మ‌ల్ల‌వ‌ర‌పుతో క‌లిసి ఎమ్మెల్యే వివేకానంద ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నేటి యువ‌త‌కు మాజీ ఐఏఎస్ అధికారిణి బాల‌ల‌త స్పూర్తిదాయ‌క‌మ‌న్నారు. కృషి, ప‌ట్టుద‌ల‌తో తాను రెండు సార్లు సివిల్స్ సాధించ‌డం గొప్ప‌విష‌య‌మ‌ని తెలిపారు. సోష‌ల్ మీడియాలో అన‌వ‌స‌ర‌మైన వాటికి కేటియించే స‌మ‌యాన్ని బాల‌లతా లాంటి గొప్ప‌వ్య‌క్తులు ఇచ్చే స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను చూడాల‌ని, వినాల‌ని విద్యార్థుల‌కు సూచించారు.

ఉద్యోగాల‌ను సృష్టించేవారిగా ఎద‌గాలిః బాల‌ల‌త‌
అన్నంత‌రం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మాజీ డైరెక్ట‌ర్ , ధ‌నిక్ భార‌త్ ఎడ్యుకేష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌న్స్ డైరెక్ట‌ర్‌ బాల‌ల‌త‌ మ‌ల్ల‌వ‌ర‌పు మాట్లాడుతూ యువ‌త ఉద్యోగులు కాకుండా ఉద్యోగాల‌ను సృష్టించే పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాల‌ని విద్యార్థుల‌ను కోరారు. తాను చిన్న‌ప్పుడే పోలియోకు గురైన‌ప్ప‌టికీ త‌న ల‌క్ష్యం కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మించాన‌ని త‌న జీవితంలో ఎదుర్కొన్న స‌వాళ్ల‌ను విద్యార్థుల‌కు వివరించారు. మ‌న‌దేశం వందేళ్ళుగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకుంటున్నామ‌ని, అభివృద్ధి చెందిన దేశం ఎప్పుడ‌వుతుంద‌ని ప్ర‌శ్నించారు. భార‌త‌దేశం అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకోవాలంటే అది యువ‌త చేతుల్లోనే ఉంద‌న‌న్నారు. అందుకోసం యువ‌తను త‌న వంతుగా స‌న్న‌ద్ధం చేస్తున్నామ‌ని తెలిపారు. ఉన్న‌త ల‌క్ష్య‌యాల‌తో యువ‌త ముందుకు పోవాల్సిన అవ‌సరం ఉంద‌న్నారు. ప‌ద‌వ‌త‌ర‌గ‌తి భ‌విష్య‌త్తుకు మొద‌టి మొట్టుగా భావించి అత్యుత్త‌మ ఫ‌లితాల‌ను సాధించాల‌ని విద్యార్థును కోరారు. కార్య‌క్ర‌మంలో కుత్బుల్లాపూర్ మండ‌ల విద్యాధికారిణి జ‌మిని కుమారి, మాజీ కార్పోరేట‌ర్ సురేష్ రెడ్డి, ట్ర‌స్మా రాష్ట్ర అసోసియేట్ అధ్య‌క్షుడు కె.రామేశ్వ‌ర్‌రెడ్డి, జిల్లా ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి బిర్రు ఆంజ‌నేయులు, జిల్లా నాయ‌కులు గ‌డ్డ‌మీది బాల‌రాజు, శ్రీనివాస్‌రెడ్డి, వీరన్న‌, శ్యాం, ట్ర‌ప‌సా గ్రేట‌ర్ కుత్బుల్లాపూర్ చైర్మెన్ కోలా వెంక‌టేశ్ ముదిరాజ్‌, అధ్య‌క్షుడు వినోద్ జాద‌వ్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌నార్థ‌న్ ద‌యాక‌ర్‌, కోశాధికారి శ్రీశైలం, సీనియ‌ర్ క‌ర‌స్పాండెంట్స్ బ‌లరాం యాద‌వ్‌, న‌ర్సింహులుగౌడ్‌, ప్ర‌వీణ్‌రెడ్డి, మ‌ధుకుమార్‌, భూపాల్‌రెడ్డి, ధ‌నిక్ భార‌త్ విద్యాసంస్థ‌ల ప్ర‌తినిధులు అజ‌య్ విక్రం, గిరిబాబు, ర‌వీంద‌ర్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.