Take a fresh look at your lifestyle.

శాస్త్రోక్తంగా 15వ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆరాధన దినోత్సవం

 

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:

సత్య సాయి బాబా 15వ ఆరాధన దినోత్సవాన్ని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు శ్రీ సాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు హకిం విశ్వప్రసాద్ తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి బాబా దేవాలయంలో తెల్లవారుజామున భక్తులు సామూహికంగా ప్రత్యేక అభిషేక పూజలు, భజనలు, అర్చనలు, హారతులు నిర్వహించారు.

ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగర్‌కర్నూల్ ఆర్టీసీ బస్టాండ్‌లో అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1979లో స్వయంగా బాబా నాగర్‌కర్నూల్‌కు విచ్చేసిన సందర్భాన్ని స్మరించుకున్నారు. సత్యసాయి సేవా సంస్థలు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు నిత్య అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు.

అదేవిధంగా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నిర్వహించిన అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు హకిం మురళి, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏ. రోహిత్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్యలు ప్రారంబించారు. ఆసుపత్రిలో ప్రతిరోజూ సుమారు 150 మంది రోగి సహాయకులకు అన్నప్రసాదం అందించడం గొప్ప సేవా కార్యక్రమమని తెలిపారు.

ఈ రోజు ప్రత్యేకంగా 3 వేల మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసినట్లు సత్యసాయి సేవా సంస్థ కన్వీనర్ బాలరాజు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సత్యసాయి భజన మండలి సభ్యులు, యువత, మహిళలు, సేవాదళ్ కన్వీనర్లు, వార్డు బాధ్యులు, బాలవికాస్ గురువులు, సాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.