Take a fresh look at your lifestyle.

వీర హనుమాన్ విజయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరిలో ఏప్రిల్ 2న జరిగే వీర హనుమాన్ విజయాత్ర ర్యాలీ పోస్టర్ ను పట్టణంలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో మంగళవారం బజరంగ్ దళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోల శ్రీనివాస్ గుప్తా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ జిల్లా కార్యదర్శి గీస ఆనంద్ మాట్లాడుతూ
త్యాగమయ జీవితంలో మానవ సమాజానికి ఆదర్శమూర్తిగా కొనియాడబడుతూ చిరంజీవిగా నిలిచిన వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీ సందర్భంగా ధర్మ రక్షణలో హనుమంతుడు చూపిన దారిలో రామరాజ్య స్థాపనకై అందరూ కలిసి రావాలని.. పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్ బింగి భరత్ కుమార్ మాట్లాడుతూ హనుమంతుడిని ఆదర్శంగా తీసుకొని భువనగిరి పట్టణంలో ఏప్రిల్ 2 న గురువారం జరగబోయే ర్యాలీలో నేటి యువత కదిలి వచ్చి శక్తి ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేష్, ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ బాదం ప్రకాష్ జి, విభాగ్ సహకార్యవహ తాడెం పాండుజి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్, టిఆర్ఎస్ కౌన్సిలర్ నాకోటి నరేష్ , హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి దేవరకొండ నరసింహ చారి, విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు పసుపునూరి మనోహర్, సుక్కల శ్రీశైలం యాదవ్, కోశాధికారి చామ రవీందర్, జిల్లా, సామాజిక సమరసత ప్రముఖ్ కేమోజు మల్లికార్జున చారి, లీగల్ కన్వీనర్ సెల్వేరు సత్సంగ్, ప్రముఖ్ పెద్దగాని శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కందికొండ సహాదేవ్, బిజెపి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం, సుర్వి శ్రీనివాస్, ఉడుత భాస్కర్, సత్సంగ్ ప్రముఖ్ వాళ్ళబోజు సతీష్, పాదరాజు మనోజ్, మేకల భాను, జిల్లా గొరక్ష ప్రముఖ్ నమిలే నవీన్, పట్టణ కన్వీనర్ జడల అక్షయ్, పొన్నాల వినయ్, పూర్తి సమయ కార్యకర్త పూస శ్రీనివాస్, సుర్వి మణికంఠ, శ్రీరామోజు ఆనంద్, రావుల సంతోష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.