Take a fresh look at your lifestyle.

ధ్వజారోహణంతో మొదలైన స్వర్ణగిరి బ్రహ్మోత్సవాలు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన స్వర్ణగిరిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీ వారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యార్చనలు పూర్తి చేశారు. అనంతరం వైనతేయ హవనం జరిపి బంగారు ధ్వజస్థంభం మీద గరుడ పటాన్ని ఎగురవేశారు. సంతానం లేని దంపతులకు గరుడ ప్రసాదాన్ని అందించారు. శ్రీ రంగం క్షేత్రం నుండి శేష వస్త్రం పుష్ప మాలికలను అక్కడి ప్రధానార్చకులు మురారి భట్టర్ స్వామి వారు స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సమర్పించారు. సోమవారం అగ్ని ప్రతిష్ఠ, మూర్తి కుంభారాధన, ధ్వజారోహణం (గరుడ పట ఆవిష్కరణ), వైనతేయ హవనం, ఇష్టి, పల్లకీ సేవతో స్వామివారి దివ్య దర్శనం ఘనంగా నిర్వహించబడింది

Leave A Reply

Your email address will not be published.