Take a fresh look at your lifestyle.

కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్ లో స్థలం కేటాయింపు..

జగిత్యాలను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడం లక్ష్యం..

రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

ముద్ర న్యూస్, జగిత్యాల:

జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్ శివారులోని సర్వే నెంబర్ 437లో స్థలం కేటాయించినట్లు రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు కలిసి నర్సింగాపూర్ లోని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించే తలపెట్టిన స్థలాన్ని మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఇన్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ముందుకు సాగుతున్నారని మంత్రి తెలిపారు.

జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని నర్సింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం 6 ఎకరాల స్థలాన్ని సర్వే నెంబర్ 437లో కేటాయిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇప్పటికే రూ. 33 కోట్లతో ఐటిఐ, ఈ ఏటీసీ సెంటర్ ను ఇక్కడ ఏర్పాటు చేశామని వృద్ధ ఆశ్రమం సైతం ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో ఈ ప్రాంతం ఎడ్యుకేషన్ హబ్ గా మారుతుందని మంత్రి తెలిపారు.

చల్ గల్ లోని వ్యవసాయ పరిశోధనకు సంబంధించిన వాలంతరీ భూములను 12 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి కేటాయించడం జరిగిందని మంత్రి వివరించారు.

కేంద్రీయ విద్యాలయానికి రెండు ఎకరాల స్థలం సరిపోదని వివాదం నేపథ్యంలో నర్సింగాపూర్ లో ప్రభుత్వ భూమి కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం చల్ గల్ మరిన్ని వ్యవసాయ పరిశోధనలు జరగాల్సిన నేపథ్యంలో వ్యవసాయ పరిశోధనల భవిష్యత్తు అవసరాల కోసం అక్కడి భూములను అంతకు మించి కేటాయించే అవకాశం లేదని మంత్రి తెలిపారు.

నర్సింగాపూర్ భూముల ప్రతిపాదనలు జిల్లా అధికారుల ద్వారా కేంద్రీయ విద్యాలయ అధికారులకు ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని ఎందుకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సహకరించాలని మంత్రి కోరారు.

Leave A Reply

Your email address will not be published.