Take a fresh look at your lifestyle.

భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు

 

ముద్ర,గద్వాల: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌ను జోగుళాంబ గద్వాల జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం శనివారం రంజాన్‌ను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

ఈద్ అల్‌ ఫితర్‌ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలతో వేలాదిమంది ముస్లిం సోదరులు రంజాన్ పండుగ పవిత్రతను చాటి చెప్పారు. రంజాన్ సందర్భంగా గద్వాల పట్టణంలోని ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్ధనలకు వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు.

చిన్నా పెద్దా అన్న తారతమ్యం లేకుండా కుటుంబ సభ్యులంతా కొత్త బట్టలు ధరించి, భక్తిభావంతో ప్రార్థనలకు వచ్చారు. ఈ ప్రార్థనలలో మత గురువులు మత పెద్దలు, ముత్తువలిలు రంజాన్ పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి బోధనలు నిర్వహించారు. గద్వాల్ పట్టణం ఈద్గా వద్ద జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రార్థన చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈద్గా వద్ద నిర్వహించిన ప్రార్థనలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మీ నర్సింహులు, వైస్ చైర్మన్ శంకర్, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, బీఅర్ఎస్ పార్టీ‌ నియో జకవర్గ ఇంచార్జీ బాసు హన్మంతునాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, నాయకులు గాజులపాడు రాఘవేంద్ర రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం వారు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ప్రార్థనల సందర్భంగా ఈద్గా మైదానం వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.