Take a fresh look at your lifestyle.

మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట : పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన “మహాలక్ష్మి మహిళా ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా 200 కోట్ల మంది మహిళలు ప్రయాణించిన సందర్భంగా బుధవారం వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండులో నిర్వహించిన వారోత్సవాలలో పరిగి ఎమ్మెల్యే, డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాల్ని అమలు చేస్తుందని తెలిపారు. అందులో ప్రధానమైనది “మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం”, దీని ద్వారా ఇప్పటికే 200 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు అని, అదేవిధంగా పరిగి నియోజకవర్గంలో ఒక కోటి 29 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని అన్నారు. మహిళల అభివృద్ధి లేకుండా సమాజం అభివృద్ధి సాధ్యం కాదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు..మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక భారం తగ్గిందన్నారు.మహిళలందరికీ ఇందిరమ్మ ఇల్లు, వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు, మహాలక్ష్మి పథకం, అమ్మ ఆదర్శ కమిటీ, మహిళలు ఆర్థిక రంగాల్లో డ్వాక్రా సంఘాల రుణాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లు, పచ్చళ్ళు తయారీ కేంద్రాలు వంటి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని, పథకాలతో మహిళల జీవితాల్లో మార్పు తీసుకు వస్తున్నామని అన్నారు. పరిగి బస్టాండ్ అభివృద్ధికి దిశగా గతంలోనే తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలు చర్యలు చేపట్టానని, పరిగి బస్టాండ్ ని మరింత అభివృద్ధి చేయడం కోసం కృషి కొనసాగిస్తానని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.