ముద్ర, నారాయణపేట :
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణపేట మండలం జలాల్పూర్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రూ.4 లక్షల 17 వేల 200 రూపాయల నగదు పట్టుబడింది. మున్సిపాలిటీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద FST ఫ్లయింగ్ స్కాడ్ టీం వాహనల తనిఖీల చేస్తుండగా యాదగిరి నుండి నారాయణపేట వస్తున్న మహమ్మద్ యూనస్ వద్ద 2 లక్షల 17వేల 200 నగదు అలాగే అశోక్ నగర్ కు చెందిన నాగిరెడ్డి వద్ద రూ. 2 లక్షల నగదు పట్టుబడింది. పట్టుబడిన నగదును కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్ లో అప్పగించినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో నగదు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకురావడం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు.