Take a fresh look at your lifestyle.

ఘనంగా అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలు.

 
ముద్ర మోత్కూరు:
మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాల వార్షికోత్సవ వేడుకలను శనివారం అంగరంగ వైభవంగ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు వేసిన నృత్యాలు సూపర్ లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను మేమేంటోలను అందజేశారు.పాఠశాల ప్రిన్సిపాల్ రాజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాల్లో ఉన్నతులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అన్నారు. చిన్నారులకు చదువుతోపాటు ఆటపాటలు కూడా ముఖ్యమని భావించి తాము ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. తమ ఉపాధ్యాయ బృందం విద్యార్థుల విద్య అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. తమ విద్యాసంస్థలో విద్యను అభ్యసించిన విద్యార్థులు డాక్టర్లుగా ఇంజనీర్లుగా రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.