ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది నిధులు, నీళ్లు, నియామకాలని అవి అన్ని గత ప్రభుత్వం తుంగలో త్రొక్కినదని, నేటి సి ఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజాపాలనలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చాలని “తెలంగాణ ఉద్యమకారుల సంఘం” రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో ఆర్ధికంగా బలంగా ఉన్న రాష్ట్రమని ఉద్యమకారులకు 250 చ.గజముల స్థలము, రూ॥ 30,000 పెన్షన్, ఆరోగ్యరీత్యా హెల్త్ కార్డులు వెంటనే ఇచ్చి ఉద్యమకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో మెరుగు మధు, ముష్కె జయపాల్రెడ్డి, మంతపురం వినోద్, సుర్వి శ్రీనివాస్ గౌడ్, డి.ఎస్. మాణిక్యమ్మ, బేజాడి కుమార్, కొడిమాల కృష్ణ, గొర్ల లక్ష్మణ్, గోపరాజు గణేష్, అవిశెట్టి పాండు, జేరిపోతుల బాలయ్య, పంజాల శ్రీనివాస్ గౌడ్, లింగంపల్లి రవిందర్, బొమ్మ రవిందర్, ఉప్పల కృష్ణమాచారి పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.