స్వర్ణ దేవాలయంలో మంత్రి ప్రత్యేక ప్రార్థనలు.. దేశ, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన మంత్రి అడ్లూరి
అమృత్ సర్:
పంజాబ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సోమవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం హర్యానాలోని చండీగఢ్ లో చింతన్ శివర్ కార్యక్రమం ముగించుకొని సోమవారం
అమృత్‌సర్ చేరుకున్న మంత్రి ముందుగా గురుద్వారాలోని పవిత్ర సరస్సులో నది స్థానం చేసిన అనంతరం స్వర్ణ దేవాలయంలో గురుగ్రంథ్ సాహిబ్‌కు నమస్కరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశం, రాష్ట్రం ప్రజల శ్రేయస్సు కోసం గురుద్వార్ సందర్శించి ప్రత్యేక ప్రార్థన నిర్వహించినట్లు మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సాదర స్వాగతం పలికారు ఆలయ విశిష్టతలు, చరిత్రను మంత్రి గారికి వివరించారు. మంత్రి అడ్లూరి గురుద్వారా సంప్రదాయం ప్రకారం లంగర్ సేవలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు. స్వర్ణ దేవాలయం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు దేశ ఐక్యతకు, సాంస్కృతిక విలువల పరిరక్షణకు ప్రతీకలని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు.