Take a fresh look at your lifestyle.

భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం.

  • నాగర్ కర్నూల్ జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ విజయేందిర బోయి

ముద్ర ప్రతినిధి, కల్వకుర్తి : భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతిని అమల్లోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.బుధవారం కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఊరుకొండ లో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరించేందుకు విప్లవాత్మకమైన “భూ భారతి చట్టం”ను రూపొందించిందని తెలిపారు.ఈ చట్టం ద్వారా భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.భూ సమస్యల పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందిం చిందన్నారు. ఎంతోమందిమేధావులు,అధికారులు భూభారతి చట్టానికి రూపకల్పన చేశారని వివరించారు.గతంలో సరైన రిజిస్ట్రేషన్ లేకుండా జరిగిన సాధాబైనామా లావాదేవీలకు ఈ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హులైన వారు నిర్దేశిత ప్రక్రియ ద్వారా తమ సాధాబైనామాలను క్రమబద్ధీకరించుకోవచ్చు నని సూచించారు.అంతేకాకుండా, వారసత్వ భూముల విషయంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. భూ సమస్యకు సంబంధించి తహశీల్దార్ స్థాయిలో పరిష్కారం లభించని పక్షంలో, బాధిత పక్షం ఆర్.డి.ఓ (రెవెన్యూ డివిజనల్ అధికారి), జిల్లా కలెక్టర్, లేదా సి.సి.ఎల్.ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) లకు వరుసగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలియజేశారు. ఈ అప్పీల్ ప్రక్రియ కూడా నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేయబడుతుందని జిల్లా కలెక్టర్ వివరించినారు.భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరింత పారదర్శకత మరియు కచ్చితత్వం కోసం ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందని కలెక్టర్ వెల్లడించారు. ఇకపై ప్రతి భూమి రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా ఆ భూమి యొక్క సర్వే నిర్వహించి, మ్యాప్ తయారు చేయబడుతుంది. ఈ మ్యాప్‌ను కూడా భూమి యజమానికి అందించే పాస్ పుస్తకంలో పొందుపరుస్తారు. దీనివల్ల భవిష్యత్తులో భూ సరిహద్దులు మరియు యాజమాన్యానికి సంబంధించిన వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని తెలియజేశారు.భూ భారతి చట్టం ప్రజలందరికీ మేలు చేకూర్చే ఒక గొప్ప చట్టమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి విజ్ఞప్తి చేశారు.ఈ చట్టం అమలుకు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆమె తెలిపారు.ఈ సమావేశం లో రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్.డి. ఓ, శ్రీనివాసులు,తహశీల్దార్, ఎంపీడీవో, ఎండి యూసుఫ్ అలీ, వ్యవసాయ అధికారి, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.