Take a fresh look at your lifestyle.

భూ భారతి చట్టంతో చట్టంతో సమస్యలకు శాశ్విత పరిష్కారం

  • రైతులు సంతోషంగా ఉండేలా అధికారులు పనిచేయాలి.
  • జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

మధిర, ముద్ర విలేఖరి : భూ భారతి – కొత్త ఆర్ఓఆర్ చట్టంతో అపరిష్కృత భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేసి భూ యాజమానులు, రైతులు సంతోషంగా ఉండేలాగా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.స్థానిక రిక్రియేషన్ క్లబ్ లో మధిర మండలానికి సంబంధించి భూ భారతి – కొత్త ఆర్ఓఆర్ చట్టంపై బుధవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ భూముల పై ఉన్న వివాదాలను తొలగించి, భూ సమస్యలకు భూ భారతి చట్టంతో పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు.భూములకు సంబంధించిన సమాచారం, జిపిఎస్ ప్రక్రియ తో మరొకసారి సర్వే చేపట్టి పూర్తి సరిహద్దులు చేసి భూ యాజమాన్యం నిర్ధారించడం జరుగుతుందన్నారు. భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరించుకోవడానికి కొత్త చట్టం ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు.
భూ సమస్యలపై గతంలో కోర్టులను ఆశ్రయించేవారని, నేడు కోర్టులను ఆశ్రయించకుండానే షెడ్యూల్ అప్లై ను ఏర్పాటు చేసి భూమి విలువ ఐదు లక్షలు లోపు ఉన్న పక్షంలో ఆర్డీవో స్థాయి, ఐదు లక్షలకు పైగా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించడానికి చట్టం రూపొందించారని తెలిపారు.మండల తహసిల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారని, ఇకనుండి చేసే రిజిస్ట్రేషన్ లను అన్ని పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. గతంలో ధరణిలో కొన్ని లోపాలుండడం వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పుడు ప్రభుత్వం రూపొందించిన భూ భారతిలో వాటిని సరి చేసిందన్నారు.భూ భారతిలో రెవెన్యూ రికార్డులను సరిగ్గా నిర్వహిస్తారని, ప్రతి సంవత్సరం భూముల రికార్డులను తయారుచేసి ఆ ఫైళ్లను తహసీల్దార్‌ కార్యాలయంలో భద్రపరుస్తామన్నారు.ఇప్పుడు అమలు చేస్తున్న భూభారతిలో సైతం ఎలాంటి లోపాలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ కోరారు.న్యాయబద్దంగా భూమి కలిగిన ప్రతిఒక్కరికి భూ భద్రత, భూ హక్కుల రక్షణ కల్పించి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా ఈ చట్టం ద్వారా క్రేత్రస్ధాయిలో అధికార యంత్రాంగం పని చేస్తుందని కలెక్టర్ తెలిపారు.సాదా బైనామా దరఖాస్తులకు పూర్తి స్థాయిలో విచారణ చేసి, సంబంధిత అందరికి నోటీసులు జారీచేసే, ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు.కోర్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, న్యాయ సహాయం పొందడానికి చర్యలు చేపడతామన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు చేసేప్పుడు తప్పులు చేస్తున్నారని దీనిని నివారించడానికి దరఖాస్తుదారులకు సహాయం అందించేందుకు కలెక్టరేట్ లో సహాయక కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు.ఆర్డీవో, మండల తహసీల్దార్ కార్యాలయాల్లో సహాయక కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.సదస్సులో ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, మధిర మండల తహసీల్దార్ రాళ్లబండి రాంబాబు, మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్, అదనపు డీఆర్డోవో నూరొద్దీన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.