Take a fresh look at your lifestyle.

సర్వేయర్ల రికార్డుల నిర్వహణ పటిష్టంగా చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

  • 8 సర్వేయర్లకు ల్యాప్ టాప్ లను పంపిణీ

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: భూముల సర్వే సరిహద్దు రికార్డుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లాలోని సర్వేయర్ల కు నూతనంగా 8 ల్యాప్ టాప్ లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేయర్లు పని తీరు మెరుగు పర్చుకోవాలని,వారి నాణ్యమైన పనితీరుకు దోహదపడే విధంగా నూతనంగా అందించిన 8 ల్యాప్ టాప్ లను వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్ శ్రీనివాసులు, సర్వేయర్లు అనిల్, సునీల్, నరేష్, శ్రీనివాస్ కృష్ణప్రియ ,రాధిక, రాజశేఖర్, చారి ,రఘుపతి , సాయి చరణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.