Take a fresh look at your lifestyle.

మావోయిస్టు పార్టీతో చర్చలు జరపండి

  • ఆదివాసి పోరాట సంఘీభావ వేదిక సభ్యులు జక్క బాలయ్య.

అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో పోలీసులు మావోయిస్టులపై చేస్తున్న మారణ హోమాన్ని వెంటనే ఆపివేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆదివాసి పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి జిల్లా సభ్యులు జక్కా బాలయ్య మాట్లాడుతూ భారత బలగాలకు మరియు మావోయిస్టు బలగాలకు మధ్యలో జరుగుతున్న ఈ పోరాటంలో అమాయక ఆదివాసి ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు వెంటనే ఈ మారణ హోమాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.భారత పాలకవర్గాలు వెంటనే మావోయిస్టు పార్టీలతో చర్చలు జరపాలని అన్నారు. దండకారణ్యంలో ఉన్నటువంటి వెలకట్టలేని ఖనిజ సంపదను ప్రకృతి వనరులను పెట్టు బడిదారులకు అప్పగించకుండా భవిష్యత్తు తరాల కోసం భారతదేశ ప్రజల కోసం కాపాడాలని అన్నారు. 2024 జనవరి నుండి నేటి వరకు 498 మందిని పోలీసులు చంపివేస్తే అందులో 75% మంది అమాయక ఆదివాసి ప్రజలే ఉన్నారని 120 మంది మహిళలు ఉన్నారని ఇది ఎంతో దారుణమైన విషయమని అన్నారు.భారత ప్రభుత్వం ఈ హత్య మారణ హోమాకాండాన్ని వెంటనే ఆపివేయాలని బాలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్టలు అనే ప్రాంతంలో పదివేల మందికి పైగా భారత దేశ సైన్యము పోలీసులు మావోయిస్టులను తుద ముట్టించేందుకు వెళ్లడం చాలా బాధాకరమైన వెంటనే వారితో చర్చలు జరిపి బలగాలను వెనుతిరిగేలా చేయాలని ప్రభుత్వాన్ని బాలయ్య కోరారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి పోరాట సంఘీభావ సభ్యులు ఎడ్ల అంబయ్య, ముద్దునూరు లక్ష్మీనారాయణ, మంతటి పర్వతాలు, పెరుమల గోపాల్, బియ్యని వెంకటేష్, పాతుకుల శ్రీశైలం, నల్లమల యాదయ్య, ఇస్లావత్ తిరుపతి నాయక్, గోరటి అనిల్ కుమార్, గాజుల లక్ష్మీనారాయణ, గంటల మోహన్లాల్, నారుమళ్ళ లక్ష్మీనారాయణ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.