Take a fresh look at your lifestyle.

భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు

  • ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు

రామకృష్ణాపూర్,ముద్ర : ముస్లింల పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ఆర్కేపీ పట్టణంలో సోమవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లిం సోదరులు తెల్లవారుజామున ఈద్గాల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక డబుల్ బెడ్ రూమ్ సమీపంలోని ఈద్గాలో ముస్లిం మత పెద్దలతో కలిసి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికోకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా రామకృష్ణాపూర్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో వక్స్ బోర్డ్ బిల్ కి వ్యతిరేకంగా కుడి చేతికి నల్ల బ్యాడ్జిలను ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.