- ఇద్దరు మృతి… ఐదుగురికి గాయాలు
ముద్ర, సూర్యాపేట: హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై సూర్యాపేట ఎస్ వి కళాశాల సమీపంలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి.ఈ ఘటనలో క్లీనర్ బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడగా.. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో స్పాట్ లోనే మృతి చెందాడు.మరో ప్రయాణికుడు గుండెపోటుతో మరణించాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.రెండు బస్సులు గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం సంభవించింది.మృతిచెందిన వారిని గుంటూరు వాసులు సాయి, రసూల్‌గా పోలీసులు గుర్తించారు.