ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో రిషి అలియాస్ ప్రశాంత్ (12 ) అనే బాలుని బండ రాయితో మోది హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. మృతుడు స్థానికంగా ఉన్న కల్లు దుకాణంలో పని చేస్తున్నాడు. గ్రామంలోని చింతల చెరువు ప్రాంతంలో బాలుని మర్మాంగాలపై బండ రాయితో మోది హత్య చేసినట్లు గుర్తించారు.
కాగా శనివారం ఉదయం గ్రామస్తులు చెరువు వైపు వెళ్ళినపుడు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా వివరాలు తెలిసిన వెంటనే ఎస్పీ జానకి షర్మిల సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ క్లూస్ బృందం, డాగ్ స్క్వాడ్ ల సహాయంతో త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అన్నారు.