పనికిమాలిన వాళ్ళ
బెదిరింపులకు భయపడేది లేదు..
ఓడిపోతామని భయంతోనే బెదిరింపులు..
నాయకులు కార్యకర్తలు ప్రజలకు అండగా మేమున్నాం..
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు..
జగన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి..
జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
16వ డివిజన్లో మంత్రితో కలిసి ప్రచారంలో పాల్గొన్న వెలిచాల రాజేందర్రావు
16 వ డివిజన్లో లో ఓడిపోతామనే భయంతో కొందరు పనికిమాలిన వాళ్ళు కార్పొరేటర్ అభ్యర్థి జగన్ రెడ్డి మనుషులను బెదిరిస్తున్నారని ఆ బెదిరింపులకు ఎవరు భయపడవద్దని కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అండగా మేము ఉంటామని భరోసా కల్పించారు.
ఆదివారం కరీంనగర్లోని 16 వ డివిజన్ మల్కాపూర్ లక్ష్మీపూర్ లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కాంతాల జగన్ రెడ్డి కి మద్దతుగా జరిగిన కార్నర్ మీటింగ్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. ఓడిపోతామని భయంతోనే జగన్ రెడ్డి మనుషులను కొందరు పనికిమాలిన వాళ్ళు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆ బెదిరింపులకు ఎవరు భయపడరని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెదిరింపులపై పోలీసుల దృష్టికి తీసుకెళ్లామని వారు తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగన్ రెడ్డిని డివిజన్ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ చేసి రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. రైతులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వము మీ ఆపదలో అండగా ఉండే ప్రభుత్వము ప్రజల క్షేమం కోరే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్పొరేషన్ ఎన్నికల్లో ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని రాజేందర్ రావు నేతృత్వంలో ప్రజలకు ఏ పని కావాలన్నా చేసి పెడతామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృహత్తర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు మాట్లాడుతూ కంటి ముందు అభ్యర్థి ఇంటిముందు అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న జగన్ రెడ్డిని డివిజన్ ప్రజలు గెలిపించాలని కోరారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్న ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్నర్ మీటింగ్ కు డివిజన్ ప్రజలు మహిళలు కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కాంతాల జగన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బొమ్మ ఈశ్వర్ గౌడ్ కోటోజు శ్రీనివాసు పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.