Take a fresh look at your lifestyle.

ప్రాధాన్యత రంగాలకు 2971.20 కోట్ల రుణాలు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

 

ముద్ర, మహదేవపూర్:

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకు 2971.20 కోట్లు రుణాలు అందించడం లక్ష్యం కాగా డిసెంబర్ మాసం నాటికి 1937.21 కోట్ల రుణాలు అందించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జిల్లా కన్సల్టేటివ్, జిల్లా స్థాయి రివ్యూ కమిటీ మరియు జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు కార్యాచరణ తయారు చేయాలని సూచించారు. రుణ లక్ష్య సాధనలో మరింత ప్రగతి సాధించేందుకు బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. జిల్లాలో పంట రుణాలు, ఎం.ఎస్.ఎం.ఈ, హౌసింగ్, విద్య, వ్యవసాయ రుణాలను సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు అమలులో లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా రుణాలు అందించాలని అన్నారు. ఆయా బ్యాంకుల్లో పెండింగ్ లో ఉన్న యూనిట్లను బ్యాంకు అధికారులను సంప్రదించి రుణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రికవరీ శాతాన్ని పెంచేందుకు అధికారులు గ్రామ స్థాయిలో లబ్దిదారులకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులు బ్యాంకర్లు నిర్లక్ష్యం చేయొద్దని, చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో పాడి పరిశ్రమకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అదే విధంగా కోళ్ల ఫారాలు నెలకొల్పుకునేందుకు, సెరికల్చర్ చేపట్టేందుకు అధిక మొత్తంలో రుణాలు ఇచ్చే విధంగా కృషి చేయాలని అన్నారు. ప్రాధాన్యతా రంగాలకు సకాలంలో రుణాలు అందిచాలని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు
పంట రుణాలు చెల్లించిన రైతులకు తిరిగి రెన్యూవల్ చేయడం లేదని, ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఆపుతున్నారని అన్నారు. రెన్యూవల్ కాకుండా ఇబ్బందులు పడే 100 మంది రైతులను చూపిస్తానని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రుణాలు చెల్లించని వారికి అవగాహన కల్పించి వసూలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కానీ ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారు. బ్యాంకర్లు రుణాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ప్రజలు, రైతులతో మంచిగా ఉండాలని, అపుడే లావాదేవీలు బాగా జరుగుతాయని స్పష్టం చేశారు. మొండి కేసులు వివరాలు నాకు చెప్పండి నేను వసూలు చేసే బాధ్యత ఎమ్మెల్యే సత్యనారాయణ రావు తాను తీసుకుంటానని తెలిపారు. బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా సత్సంబంధాలు ఉంచుకోవాలని సూచించారు. కొంతమంది బ్యాంకర్ల వల్ల మంచి రైతులు సైతం ఇబ్బంది పడుతున్నారని, సక్రమంగా చెల్లించని వారు మంచిగా రుణాలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ ప్రాంతంలో డైరీ యూనిట్ కు మంచి అవకాశం ఉందని, డైరీ యూనిట్ ఎర్పాటుకు రుణ సదుపాయం కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, ఆర్.బి.ఐ. ఎల్.డి.ఓ యశ్వంత్ సాయి, నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, యూబీఐ డిజిఎం, టిజిబి ఆర్ ఎం, ఎల్.డి.ఎం. ఎ.తిరుపతి, జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.