-అదుపులోకి నలుగురు మహిళలు
-వ్యభిచారం నిర్వహణపై కేసు నమోదు
ముద్ర, నారాయణపేట :
నారాయణపేట జిల్లా కేంద్రంలోని మూన్ లైట్ డార్మెటరీ లాడ్జ్ లో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారంతో నారాయణపేట పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి వ్యభిచారం నిర్వహిస్తున్న నలుగురు మహిళలను పట్టుకున్నారు. అలాగే లాడ్జ్ యజమాని బుగ్గేశ్వర్ పై కేసు నమోదు చేశారు. పట్టుబడిన మహిళలకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి, వారికి అవసరమైన సహాయం అందించే చర్యలు చేపట్టారు. అనంతరం వారిని స్టేట్ హోమ్‌కు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణపేట సీఐ శివశంకర్, ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ లాడ్జిల్ల, ఇళ్ళలో అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. దాడుల్లో కానిస్టేబుల్ సంతోష్, శిరీష గౌడ్, అర్చన ఉన్నారు.